చిన్పప్పుడు తమన్ ఏం చేసేవాడో తెలుసా?

Chakravarthi Kalyan

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రసవత్తరంగా సాగుతోంది. ప్రతి వారం ఎపిసోడ్ అభిమానులకు థ్రిల్ పంచుతోంది. ఇప్పుడు మెగా మ్యూజిక్ షోలో మరో స్పెషల్ మూమెంట్. ఈ షోకి జడ్జిగా ఉంటున్న సన్షేషనల్ కంపోజర్ తమన్ అమ్మగారు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది.


తమన్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఘంటసాల సాయి శ్రీనివాస్ అలియాస్ తమన్ చిన్నప్పటి ముచ్చట్లు తెలిపారు. తమన్ చిన్నప్పుడు క్లాస్ రూంలో కన్నా మైదానంలోనే ఎక్కువగా ఉండేవాడని చెప్పారు. తనకి అస్సలు భయం లేదని.. స్కూల్లో గొడవలు కూడా వచ్చేవని వివరించారు.


తోటి పిల్లలు టిఫిన్ బాక్స్ లు ఓపెన్ చేసి తినేసేవాడని కంప్లెయింట్ లు ఉండేవని అలనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.


ఐతే తమన్ హార్డ్ వర్క్ చేస్తాడని వర్క్ అయ్యేవరకు తిండి కూడా పట్టించుకోడని సంగీతం క్రికెట్ తనకి బాగా ఇష్టమని వివరించారు. ఇవి తప్ప మరో ప్రపంచం తెలియదని అన్నారు. ఇలా చాలా చాల సంగతులు గురించి చెప్పారు. వాటి గురించి తెలుసుకోవాలంటే తెలగు ఇండియన్ ఐడల్-3 చూడాల్సిందే.


ఈ ఎమోషనల్ అండ్ హార్ట్ టచ్చింగ్ ఎపిసోడ్ ఆహాలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి ఏడు గంటలకు ప్రసార మయ్యే తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-3ని మిస్ అవ్వకండి. తమన్ గురించి మరిన్ని ఆసక్తికర అంశాలు తెలుసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: