నాగార్జున సాగర్‌కు జలపరవళ్లు.. చూసేందుకు కళ్లు చాలవుగా?

Chakravarthi Kalyan
నాగార్జున సాగర్‌కు జల పరవళ్లు కొనసాగుతున్నాయి. నాగార్జున సాగర్‌ జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం కొనసాగుతోంది. నాగార్జున సాగర్‌ జలాశయంలో మొత్తం 22 గేట్లు ఎత్తి నీటిని దిగవకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం- 590.00 అడుగులుగా ఉంది. నాగార్జున సాగర్‌ ప్రస్తుత నీటి మట్టం - 585.00 అడుగులుగా ఉంది.
నాగార్జున సాగర్‌ పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం - 312.50 టీఎంసీలుగా ఉంది. నాగార్జున సాగర్‌ ప్రస్తుత నీటి నిల్వ - 297.43 టీఎంసీలుగా ఉంది. నాగార్జున సాగర్ ఇన్ ఫ్లో - 3,13,966 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ ఔట్ ఫ్లో - 3,54,035 క్యూసెక్కులుగా ఉంది. 10 అడుగుల మేర 22 గేట్లు ఎత్తిన అధికారులు కిందకు నీరు విడుదల చేస్తున్నారు. మరో నాలుగైదు రోజులు ఈ ప్రవాహం కొనసాగితే ఏడాది వరకు తెలుగు రాష్ట్రాలకు దాహార్తి తీరినట్టే భావించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: