ఢిల్లీ: ప్రధాని మోదీ ఇంట్లో హల్చల్ చేసిన నాగరాజా..?

FARMANULLA SHAIK
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్దియే పార్టీ తరపున హ్యాట్రిక్ పీఎంగా మరల నరేంద్ర మోడీనే అధికారం చేపట్టారు. కాకపోతే ఈసారి ఎన్నికల్లో మోదీ విజయం వెనక ఏపీ నుండి కూటమి ప్రభుత్వం అలాగే బీహార్ నుండి ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా మారాయి.వారిద్దరి సపోర్ట్ తో ముచ్చటగా మూడోసారి మోడీజీ అధికార చేపట్టారు.ఐతే ప్రస్తుతం పీఎం మోదీ ఇంట్లో జరిగిన ఒక సన్నివేశం అనేది సోషల్ మీడియా లో ఒక పెద్ద వైరల్ గా మారింది.గత కొన్ని రోజులుగా దేశ రాజధానిలోని వివిద ప్రాంతాల్లో పాములు తిరుగుతున్నట్లు ఎమర్జెన్సీ రెస్క్యూ హెల్ప్‌లైన్‌కు అనేక కాల్స్ వస్తూనే ఉన్నాయి.ఈ క్రమంలో ఆ పాములను వైల్డ్‌లైఫ్ SOS బృందాలు రక్షించి అటవీ ప్రాంతాలకు తరలిస్తున్నారు.సాధారణంగా వర్షాకాలం అంటే పాములు సంచరించే కాలం. వర్షాకాలంలో వర్షాలకు ప్రకతి మొత్తం పచ్చగా తయారవుతుంది. ఎక్కడ చూసినా ఏపుగా పెరిగిన గడ్డి దుబ్బులు, బహిరంగ ప్రదేశాల్లో గుబురుగా పెరిగిన మొక్కలు వెరసి అది పాములకు అడ్డాగా మారుతుంది. ఈ క్రమంలోనే ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో ఓ నాగు పాము దూరింది. ఇదిగమనించిన సెక్యూరిటి సిబ్బంది వైల్డ్‌లైఫ్ SOS సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న రెస్క్యూ సిబ్బంది ప్రధానమంత్రి నివాసంలో 3 అడుగుల పొడవున్న నాగు పామును పట్టుకున్నారు.అనంతరం ఆ పాముకు పూర్తి వైద్య పరీక్షల చేసి స్థానికంగా ఉన్న అటవీ ప్రాంతంలో వదిలారు. అయితే ఆ పాము తన ఆహారం కోసం ఓ ఎలుకను వెంబడిస్తూ.. ప్రధాని నివాసంలోకి వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు.అయితే సోషల్ మీడియా ప్రేక్షకులు ఇలాంటి సన్నివేశంపై వారి వారి మనసులోని భావాలను బయటకి వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో భాగంగా పాములకి ఏం తెలుసు పాపం అది పీఎం ఇల్లు, అది సీఎం ఇల్లు అని సరదాగా పోస్ట్ లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: