తెలంగాణలోని ఓ వంతెన కడుతుంటూనే కూలిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై కడుతున్న వంతెన.. పూర్తి కాకుండానే కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ వంతెన కూలిపోయింది. ఓడేడు నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి మధ్య దూరం తగ్గించేందుకు ఈ వంతెన వాగుపై నిర్మిస్తున్నారు. ఈ వంతెన పనులు 2016లో ప్రారంభమయ్యాయి. మధ్యలో కాంట్రాక్టర్లు మారారు. నిధుల కొరత వల్ల ఆలస్యం అయ్యింది.
అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో వంతెన కూలడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. వంతెన కూలిన సంగతి సోమవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు చెప్పారు. అదే పగటి వేళ ఈ వంతెన కూలి ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేది. అయినా నిర్మాణం పూర్తికాకుండానే కూలడం ఏంట్రా బాబూ అనుకుంటున్నారు జనం.