టార్గెట్‌ బీఆర్ఎస్‌ ఎంపీ సంతోష్.. ఆ కేసులో దొరికాడా?

Chakravarthi Kalyan
రేవంత్ రెడ్డి సర్కారు పాత ప్రభుత్వంలోని అనేక విషయాలపై విచారణలు జరిపిస్తోంది. తాజాగా బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్‌ పైనా ఓ కేసు నమోదైంది. అయితే.. బంజారాహిల్స్ లో తనపై నమోదైన కేసుపై ఎంపి సంతోష్ కుమార్‌ స్పందించారు. షేక్ పేటలోని సర్వే నంబర్ 129/54 లో ఉన్న 904 చదరపు గజాల ఇంటి స్థలం నేను  శ్యాంసుందర్ ఫుల్జాల్ నుంచి కొనుగోలు చేశానంటున్న జోగినపల్లి సంతోష్ కుమార్.. 2016లో రూ. 3.81కోట్లు చెల్లించి, బాజాప్తా సేల్ డీడ్ ద్వారా, రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు చేశానని అంటున్నారు.

ఇందులో ఫోర్జరీ అనే మాటకు తావులేదని.. ఎనిమిది సంవత్సరాలుగా ఎలాంటి న్యాయవివాదం తలెత్తలేదని సంతోష్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">జోగినపల్లి సంతోష్ కుమార్ గుర్తు చేశారు. నేను కొనుగోలు చేసిన తర్వాత ఆ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదన్న జోగినపల్లి సంతోష్ కుమార్.. శ్యాంసుందర్, అంతకన్నా ముందు వాళ్లు చేపట్టిన నిర్మాణాలే కొనసాగుతున్నాయన్నారు. న్యాయపరమైన అంశాలు ఉంటే ముందుగా నాకు లీగల్ నోటీసు ఇవ్వాలన్న జోగినపల్లి సంతోష్ కుమార్.. కేవలం రాజకీయ దురుద్దేశంతో నమోదు చేసిన కేసు అని స్పష్టంగా అర్థమవుతుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: