రేవంత్.. చెప్పేవి శ్రీరంగనీతులు.. చేసేవి..?
గతంలో దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రోజున.. పార్టీలో బీసీలకు ప్రాధాన్యం తగ్గిందని అందుకే పార్టీ వీడుతున్నట్లుగా దాసోజు శ్రవణ్ ప్రకటించారు. ఇప్పుడు తిరిగి మళ్లీ అదే కాంగ్రెస్ పార్టీలో ఏ ముఖంతో చేరారని దాసోజు శ్రవణ్ ద్వజమెత్తారు. రేవంత్ ప్రభుత్వం ఒక సామాజిక వర్గానికి కొమ్ముకాస్తూ, బీసీ ఎస్సీ ఎస్టీలను వంచిస్తుందని దాసోజు శ్రవణ్ ఆక్షేపించారు.