కొత్త రికార్డులు సృష్టిస్తున్న సింగరేణి?

Chakravarthi Kalyan
సింగరేణి సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో సంస్థ చరిత్రలోనే అత్యధికంగా రూ. 37 వేల కోట్లకు పైగా అమ్మకాలను సాధించబోతోంది. గత ఆర్థిక సంవత్సరం సాధించిన 33 వేల కోట్ల రూపాయల టర్నోవర్ కన్నా ఇది 12 శాతం అధికం. ఇందులో బొగ్గు అమ్మకాల ద్వారా రూ.32,500 కోట్లు, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్ అమ్మకాల ద్వారా రూ.4,500 కోట్ల టర్నోవర్ ను సాధించనుంది. దేశంలో నవరత్న కంపెనీల కన్నా మిన్నగా సింగరేణి అద్భుత పనితీరును కనబరించింది.
గత ఏడాది సాధించిన 33 వేల కోట్ల టర్నోవర్ ను,  గత నెల ఫిబ్రవరి మాసాంతానికే సాధించింది. ఈ  ఆర్థిక సంవత్సరంలో 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, అదే పరిమాణంలో బొగ్గు రవాణా జరపాలని నిర్ణయించింది. ఈ దిశగా అన్ని ఏరియాలు రోజువారీ లక్ష్యాల సాధనకు కృషి చేస్తున్నాయి. వార్షిక లక్ష్య సాధన దిశగా ముందుకు పోతున్నాయి. ఇకపై రోజుకు 2 లక్షల 45 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయడం ద్వారా వార్షిక లక్ష్యాన్ని చేరుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: