ఫంక్షన్‌ హాళ్లలో ఏందీ రచ్చ.. హైకోర్టు సీరియస్‌?

Chakravarthi Kalyan
ఫంక్షన్ హాళ్లలో శబ్ద నియంత్రణపై జారీ చేసిన సర్క్యులర్ల అమలుపై కార్యాచరణ నివేదిక ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల పరీక్షల సమయం ఆసన్నమవుతున్నందున వారికి ఇబ్బందికలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అధిక శబ్దాలతో ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సికింద్రాబాద్ తాడ్ బన్, బోయినపల్లిలోని బాంటియా గార్డెన్స్, ఇంపీరియల్ గార్డెన్స్ ఫంక్షన్ హాళ్ల వల్ల పరిమితికి మించిన శబ్దాలతో ఇబ్బందిగా ఉంటోందని మిలిటరీ అదనపు చీఫ్ ఇంజనీరు కల్నల్ జె. సతీష్ భరద్వాజ్ రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా పరిగణనలోకి తీసుకుంది.



ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే జస్టిస్ జె. అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది అదనపు అడ్వొకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపిస్తూ శబ్ధ నియంత్రణ పాటించాలని లేదంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటూ ఈనెల 12న సర్క్యులర్ జారీ చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలో 70 ఫంక్షన్ హాల్లు , కన్వెన్షన్ హాళ్లకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: