కోర్టులో రేవంత్‌రెడ్డికి షాక్‌.. ఇప్పుడేం చేస్తారో?

Chakravarthi Kalyan
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చినట్టు అయ్యింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాజ్యాంగ బద్దంగా గత మంత్రివర్గం చేసిన సిఫార్సు ప్రకారం తమను శాసనమండలికి నామినేట్ చేయాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజ్ ను భారాస నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ కోరారు. హైకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును స్వాగతిస్తున్నట్లు వారు తెలిపారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో చిత్తశుద్ధితో కూడిన తమ పోరాటం, త్యాగం, సేవలను గుర్తించాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు.

రాజ్యాంగంలోని 171(5) ఆర్టికల్ ప్రకారం తమకు సరిపడా అర్హతలు ఉన్నాయన్న ఇద్దరు నేతలు... సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన తమ లాంటి వారికి శాసనవ్యవస్థలో ప్రాతినిథ్యం వహించే అవకాశాలు చాలా అరుదుగా ఉంటాయన్నారు. హైకోర్టు తీర్పు, తమ అర్హతలను దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగబద్ధంగా 2023 జూలైలో మంత్రివర్గం సిఫార్సును అమలు చేయాలని శ్రవణ్, సత్యనారాయణ కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: