కాళేశ్వరం ఏటీఎం అయితే చర్యలేవీ మోదీ?

Chakravarthi Kalyan
బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఒకటే కాకుంటే కాళేశ్వరం ఏటీఎం అంటూ ఆరోపణలు చేస్తున్నప్రధాన మంత్రి మోదీ లిక్కర్‌ స్కాంలో కవితపై, కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ స్కాంలో కవితను అరెస్ట్ చేయకుండా ఆమెను కాపాడుతున్నది ఎవరని నిలదీస్తున్నారు. కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్‌ను జైలుకు పంపినప్పుడే బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్ముతారంటున్న కాంగ్రెస్ నేతలు.. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించడానికి బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్ర పన్నాయని ఆరోపించారు.
మాజీ సీఎం కేసీఆర్‌కు ఇంకా అధికార మత్తు వదలలేదన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్‌కు అభ్యర్థులు కూడా దొరకడం లేదని ద్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌ రెడ్డి స్వాగతం పలికి సుపంప్రదాయానికి తెరలేపారన్న మల్‌రెడ్డి తెలంగాణ ప్రజల కోసమే ప్రధానిని సీఎం కలిశారని.. గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ఏనాడు ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తే పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. భూఆక్రమణలు, ప్రాజెక్టుల్లో అక్రమాలు,అవినీతిపైన చేసిన ఫిర్యాదులను కేంద్రం చెత్త బుట్టలో వేసిందని రంగారెడ్డి ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: