రాహుల్‌ 73 శాతం ఫార్ములా.. వర్కవుట్‌ అవుతుందా?

Chakravarthi Kalyan
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ కొత్త వాదన ప్రారంభించారు. దేశంలో 73 శాతం మందిని మోదీ పట్టించుకోవట్లేదని అంటున్నారు. దేశంలో వెనుకబడిన వర్గాల వారు ఎంతమంది ఉన్నారో తెలుసా అంటూ లెక్కలు చెబుతున్న రాహుల్‌.. 50 శాతం. దళితులు 15శాతం, గిరిజనులు 8 శాతం ఉన్నారంటున్నారు. వీరు మొత్తం 73 శాతం మందిగా ఉన్నారని... దేశంలోని పెద్ద కంపెనీల యజమానుల జాబితా తీసుకుంటే అందులో ఈ 73 శాతానికి చెందిన వారు ఒక్కరు కూడా ఉండరని రాహుల్‌ అంటున్నారు.
ప్రైవేటు ఆసుపత్రులు, విద్యాసంస్థల యజమానుల జాబితా తీసినా..ఈ 73శాతంలో ఒక్కరూ ఉండరంటున్న రాహుల్ గాంధీ. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ నుంచి రూ.100 ఖర్చుచేస్తే ఈ 73శాతానికి రూ.6 మాత్రమే దక్కుతోందంటున్నారు.  ఈ 73శాతానికి అగ్రవర్ణ పేదలను కలిపితే...వారికి ఈ దేశంలో ఎలాంటి అవకాశాలు లేవన్న రాహుల్ గాంధీ.. గతంలో ప్రభుత్వరంగ సంస్థలు ఉండేవని.. అందులో పేదలకు ఉద్యోగాలు వచ్చేవని.. కానీ నరేంద్ర మోదీ ఈ సంస్థలన్నింటినీ మూసివేశారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: