అరె ఏంట్రా ఇది: నిన్న పార్టీలో చేరిక.. ఇవాళ టికెట్‌?

Chakravarthi Kalyan
ఎన్నికల నేపథ్యంలో జంపింగ్‌ జపాంగ్‌లు పెరిగారు. టికెట్‌ ఇస్తామని భరోసా ఇస్తే చాలు.. పార్టీ మారుతున్నారు. తాజాగా బీజేపీలో చేరిన బీఆర్ఎస్‌ ఎంపీలు ఇద్దరికి టికెట్లు దక్కాయి. బీజేపీ తన లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితాను నిన్న ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాలు ఉండగా తొలి విడతలో 195 స్థానాలకు అభ్యర్థులను బీజేపీ వెల్లడించింది. ఈ తొలి జాబితాలో తెలంగాణకు సంబందించి తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది.

మొన్న భాజపాలో చేరిన నాగర్ కర్నూల్ భారాస సిట్టింగ్ ఎంపీ రాములుకు బదులు వారి కుమారుడు భరత్ కు టికెట్ దక్కింది. రాములు విజ్ఞప్తి మేరకే అధిష్టానం భరత్ కు టికెట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక నిన్న భాజపా గూటికి చేరిన భారాస జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కు  కూడా టికెట్ దక్కింది. తెలంగాణలో మొత్తం 17లోక్ సభ స్థానాలు ఉండగా తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం మరో ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: