వరుస షాక్‌లు.. పవన్‌కు కుల బలం దక్కుతుందా?

Chakravarthi Kalyan
పైకి ఎన్ని మాటలు చెప్పుకున్నా పవన్‌ కల్యాణ్‌కు రాజకీయాల్లో కులమే బలం. కాపుల ఓట్లే పవన్‌ ధైర్యం. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు ఆయనకు కుల బలం దక్కనిస్తాయా అన్న అనుమానాలు కలిగిస్తున్నాయి. కాపు నేతలుగా పేరున్న హరిరామ జోగయ్య, ముద్రగడ వంటి వారు ఇప్పుడు పవన్‌ను సపోర్టు చేయట్లేదు. పైగా చేగొండి హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ ఇటీవల వైకాపాలో చేరాడు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైకాపా లో చేరిన చేగొండి సూర్యప్రకాష్.. తాను జనసేనలో పీఎసీ మెంబర్ గా, ఆచంట ఇన్ చార్జిగా పనిచేసినా.. పవన్‌ తీరు ఏమాత్రం ఆశాజనకంగా లేదన్నారు.
2018లో జనసేనలో చేరి ఇప్పటివరకు  కష్టపడి పనిచేశానన్న చేగొండి సూర్యప్రకాష్.. బడుగు బలహీన వర్గాలకు పవన్ అండగా నిలబడతారని ,ఆ వర్గాలకు ప్రతినిధిగా ఉంటారని జనసేనలో పనిచేశానని.. వ్యక్తిగతంగా నా ఆశలన్నీ నిరాశలయ్యాయని.. పవన్ పైకి కనిపించే తీరు వేరు , లోపల వ్యవహరించే తీరు వేరు అని.. పార్టీని సమర్థంగా నడపలేని అసమర్థుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: