ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌?

Chakravarthi Kalyan
ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులకు ఇది నిజంగా శుభవార్త. ఈడబ్ల్యూఎస్‌ కోటాలో ప్రైవేట్ బీఎడ్ కళాశాలలు అడ్మిషన్లు జరపటానికి హైకోర్టు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కోటాలో అడ్మిషన్లు జరపకుండా NCTE సౌత్ రీజియన్ కమిటీ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సస్పెండ్ చేసింది. అడ్మిషన్ల ప్రక్రియలో అవకతవకలకు పాల్పడుతున్నారని 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ కోటా అడ్మిషన్లు నిలుపుదల చేస్తూ గతంలోనే NCTE  ఆదేశాలు ఇచ్చింది.
అయితే.. ఈ ఆదేశాలు చట్టవిరుద్ధమని వాదిస్తూ కొందరు విద్యార్థులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లను ఎలా అడ్డుకుంటారని వారి తరపున పిటిషన్లు వాదించారు. అవకతవకలు జరుగుతున్నాయన్న  కారణంగా రిజర్వేషన్ల అమలు ఆపడం సమంజసం కాదని వారు వాదించారు. అవకతవకలు జరగకుండా  చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎస్‌సీటీఈపైనే ఉంటుందని పిటిషన్లు వాదించారు. వారి వాదనలో ఏకీభవించిన హైకోర్టు ఈడబ్ల్యూఎస్‌ కోటాలో ప్రైవేట్ బీఎడ్ కళాశాలలు అడ్మిషన్లు జరపటానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ews

సంబంధిత వార్తలు: