వైసీపీ కొత్త లిస్ట్.. నారా లోకేశ్‌పై పోటీకి ఆమె?

Chakravarthi Kalyan
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల అభ్యర్థులను మారుస్తూ వైసీపీ తొమ్మిదో జాబితాను ప్రకటించింది. మొత్తం మూడు స్థానాలకు ఇన్‌ఛార్జిలను నియమించింది. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి టీడీపీలోకి వెళ్లిపోయినందున అక్కడ పార్లమెంటరీ స్థానం సమన్వయకర్తగా విజయసాయిరెడ్డిని జగన్ నియమించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా రిటైర్డ్ ఏఎస్‌ ఇంతియాజ్‌ను నియమించారు. అలాగే నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరిలో వైసీపీ ఇన్‌ఛార్జిగా మురుగుడు లావణ్యను వైఎస్‌ జగన్‌ నియమించారు.

అంతకుముందు ఇక్కడ గంజి చిరంజీవిని సమన్వయకర్తగా నియమించారు. అయితే అనేక సమీకరణాల రీత్యా ఇప్పుడు ఆ స్థానంలో మురుగుడు లావణ్యను దింపారు. ఈ ప్రకటనతో దాదాపు వైసీపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అంతా పూర్తయినట్టే భావించవచ్చు. సో.. ఫైనల్‌గా నారా లోకేశ్‌ పై వైసీపీ ఓ బీసీ మహిళను బరిలో దింపింది. గతంలో ఆర్కే పై ఓడిపోయిన నారా లోకేశ్‌ మరి.. ఈసారైనా గెలుస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: