బిగ్‌ డే.. టీడీపీలోకి ఇద్దరు వైసీపీ ఎంపీలు, ఒక ఎమ్మెల్యే?

Chakravarthi Kalyan
ఎన్నికల ముందు టీడీపీకి బంపర్ ఆఫర్‌ తగిలిందనే చెప్పాలి. ప్రత్యేకించి ఈ రోజు టీడీపీకి బిగ్‌ డేగా వర్ణించవచ్చు. ఎందుకంటే.. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు, ఒక ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉన్న టీడీపీలో చేరబోతున్నారు. ఇప్పటికే వైసీపీని వీడినట్టు ప్రకటించిన వీరంతా ఇప్పుడు టీడీపీలో చేరబోతున్నారు. టీడీపీలో చేరబోయే విషయం కూడా ఊహించిందే అయినా.. ఇవాళ లాంఛనంగా ఆ ప్రక్రియ పూర్తి చేయబోతున్నారు.
వైసీపీ ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, లావు శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీలో చేరబోతున్నారు. వేమిరెడ్డి నెల్లూరులో జరిగే కార్యక్రమంలోనూ.. శ్రీకృష్ణదేవరాయలు గుంటూరు జిల్లాలో జరిగే కార్యక్రమంలోనూ టీడీపీలో చేరబోతున్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ కూడా ఇవాళే టీడీపీలో చేరబోతున్నారు. ఇలా నేతలంతా టీడీపీలో చేరడం తమ పార్టీ అధికారంలోకి రాబోతోందనడానికి చిహ్నం అంటున్నారు టీడీపీ నేతలు. మరి ఇది ఎంత వరకూ నిజమవుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: