కేటీఆర్‌కు దిమ్మతిరిగే సవాల్‌ విసిరిన రేవంత్‌ రెడ్డి?

Chakravarthi Kalyan
చేవెళ్ల సభలో సీఎం రేవంత్‌ రెడ్డి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు దిమ్మతిరిగే సవాలు విసిరారు. ఇటీవల సీఎం రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌ కొన్ని కామెంట్లు చేశారు.  ముందే సీఎం అని రేవంత్ పేరు చెప్పి ఉంటే కాంగ్రెస్‌కు గత అసెంబ్లీ ఎన్నికల్లో 3 సీట్లు కూడా వచ్చేవి కావని కేటీఆర్‌ అన్నారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. చేవెళ్ల గడ్డ నుంచి కేటీఆర్‌కు సవాలు విసురుతున్నానన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటయినా గెలిచి చూపించాలన్న సీఎం రేవంత్‌ రెడ్డి.. కేటీఆర్‌కు దమ్ముంటే ఒక్క సీటయినా గెలిచి చూపించాలన్నారు. రేవంత్‌రెడ్డి అంటే అల్లాటప్పా అనుకోవద్దన్న సీఎం రేవంత్‌ రెడ్డి.. తాను తండ్రి పేరు చెప్పుకుని పదవిలో కూర్చున్న వ్యక్తిని కాదన్నారు. కార్యకర్త స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదిగానన్న రేవంత్‌ రెడ్డి.. చంచల్‌గూడ జైలులో పెట్టినా.. లొంగిపోకుండా పోరాడానని గుర్తు చేసుకున్నారు. నల్లమల అడవుల నుంచి తొక్కుకుంటూ వచ్చానని.. కార్యకర్తల అండ ఉన్నంతకాలం నా కుర్చీని ఎవరూ తాకలేరని సీఎం రేవంత్‌ రెడ్డి అంటున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: