టీడీపీ-జనసేన.. అమిత్ షా, అబితాబచ్చన్?

Chakravarthi Kalyan
తెదేపా-జనసేన కూటమి నేతలు అమిత్ షా ను, అబితాబచ్చన్‌ను కలిసినా తాము పెద్దగా పట్టించుకోమంటున్నారు వైసీపీ నాయకులు.. రాజకీయ పార్టీలకు ఒక అజెండా ఉండాలంటున్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. అజెండాను ముందుగా చెప్పి., ఎన్నికలకు వెళ్లాలని సూచిస్తున్నారు. మేము చేసిన కార్యక్రమాలు, అభివృద్ధి చూసి నాకు ఓటు వేయమని జగన్ అడుగుతున్నారన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. ప్రతిపక్షాలు ఏమి చెప్పి., ఓట్లు అడుగుతాయని ప్రశ్నించారు.

జనసేనకు 24సీట్ల ఇవ్వటం., వారి స్థాయి ఏమిటో తెలుస్తోందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. తెదేపా-జనసేన., అమిత్ షా ను, అబితాబచ్చన్ ను కలిసినా మేము పట్టించుకోబోమన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. ప్రతిపక్షాలకు ఒక విధివిధానం అంటూ ఏమీ లేదన్నారు. మాకు కావాల్సింది మేము సింగల్ గా పోటీ చేయడమేనని.. మా పార్టీ ప్రజలను నమ్ముకుందని.. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందించామని.. ఎన్నికల మా అజెండా చెప్పాం., దాని ప్రకారం ముందుకెళ్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: