ఆంధ్రా తాగునీటి వినియోగంపై రేవంత్‌రెడ్డి నిఘా?

Chakravarthi Kalyan
ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీరు వాడుకునే విషయంలో ఏపీపై నిఘా ఉంచాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. తాగు నీటి కోసమంటూ నాగార్జున సాగ‌ర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్ 9 టీఎంసీల‌కు పైగా నీటిని తరలిస్తోంది. అయితే ఏపీలో అంత పెద్ద మొత్తంలో తాగు నీటిని ఎక్కడ వినియోగిస్తున్నారనే గణాంకాలు సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాగునీటి కోసం కాకుండా ఇతర అవసరాలకు నీటిని తీసుకోకుండా చూడాల‌ని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
నాగార్జున సాగ‌ర్‌, శ్రీ‌శైలం ప్రాజెక్టుల నుంచి తాగు నీరు తీసుకోవాలంటే కేఆర్ఎంబీకి లేఖ రాయాల్సి ఉంటుంద‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాబట్టి ఏపీకి ఎంత నీరు అవ‌స‌ర‌మో స‌మ‌గ్రంగా స‌మీక్షించి వెంట‌నే కేఆర్ఎంబీకి లేఖ రాయాల‌ని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఏప్రిల్, మే నెల‌ల్లో వ‌ర్షాల‌తో జూరాల‌కు నీరు రావ‌డంతో ఇబ్బంది తలెత్తలేదని.. లేకపోతే నారాయ‌ణ‌పూర్ జ‌లాశ‌యం నుంచి నీటి విడుదల కోసం కర్ణాటకను కోరాల్సి ఉంటుందని అధికారులు సీఎంకు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: