తెలంగాణ గ్రూప్‌ 1 నోటిఫికేషన్ వచ్చేసింది!

Chakravarthi Kalyan
తెలంగాణలో గ్రూప్‌- 1 ఉద్యోగాల నోటిఫికేషన్‌ వచ్చేసింది. ఇవాళ 2022లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్‌సీ రద్దు చేసింది. అలా రద్దు చేసిన గంటల వ్యవధిలోనే టీఎస్‌పీఎస్సీ కొత్త నోటిఫికేషన్‌ను ఇచ్చేసింది. పాత నోటిఫికేషన్‌లో ఉన్న 503 ఉద్యోగాలకు మరో 60 కలిపి మొత్తం 563 ఉద్యోగాలకు ఈ కొత్త నోటిఫికేషన్ వచ్చింది. ఈ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14వ తేదీ సాయంత్రం 5గంటల వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో గ్రూప్‌ వన్ దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఇక గ్రూప్‌ వన్‌ కు సంబంధించి మే/జూన్‌లో ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. అలాగే  సెప్టెంబర్‌/అక్టోబర్‌లో గ్రూప్‌ వన్‌  మెయిన్‌ పరీక్ష నిర్వహిస్తామని నోటిఫికేషన్‌లో చెప్పారు. దరఖాస్తుల్లో పొరపాట్లు ఉంటే మార్చి 23 నుంచి 27 సాయంత్రం 5గంటల వరకు సరి చేసుకోవచ్చు. పరీక్ష తేదీకి వారం ముందు నుంచి హాల్‌ టిక్కెట్లు అందుబాటులోకి వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: