ఆ మంత్రి రేవంత్‌ను అడిగి మరీ ఆ శాఖ తీసుకున్నారా?

Chakravarthi Kalyan
రాష్ట్రాభివృద్ధిలో ముఖ్యమంత్రికి సహకరించాలనే తాను వ్యవసాయ శాఖ అడిగి తీసుకున్నానంటున్నారు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఎన్టీఆర్ హయాంలో కూడా తాను మంత్రిగా వ్యవసాయ కళాశాలలు పెట్టించినా. అంతగా సంతృప్తి లేదని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతుల మొహాల్లో ఆనందం, కుటుంబాల్లో సంతోషం చూడాలన్నదే తన ధ్యేయమని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. 


వ్యవసాయంలో కీలకమైన విత్తనం నాణ్యత కంపెనీ, వ్యాపారి దెబ్బతీసి కల్తీలకు పాల్పడితే రైతు ఎలా బతకాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రశ్నించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో వ్యవసాయ, ఉద్యాన శాఖల సహకారంతో సీఐఐ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరగనున్న అగ్రిటెక్‌ సౌత్ - 2024 పేరిట ప్రదర్శనను వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. దక్షిణాది రాష్ట్రాల స్థాయి ఈ ప్రదర్శనలో కొలువు తీరిన 150 స్టాళ్లను మంత్రి కలియతిరిగి పరిశీలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: