కేసీఆర్‌ బర్త్‌డే.. ఆటోడ్రైవర్లకు గుడ్‌న్యూస్‌?

Chakravarthi Kalyan
భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు ఈనెల 17. ఈ సందర్భంగా ఈ నెల 17వ తేదీన వెయ్యి మంది ఆటో డ్రైవర్లకు బీమా సౌకర్యం కల్పిస్తూ పత్రాలు పంపిణీ చేయనున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కేసీఆర్ 70వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా తెలంగాణ భవన్ వేదికగా వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఆటో డ్రైవర్లకు బీమా పత్రాలతో పాటు దివ్యాంగులకు వీల్ ఛైర్ల పంపిణీ చేయనున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
ఫిబ్రవరి 17న ఆలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు కూడా జరిపేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం, ఉద్యమ నేపథ్యంలో రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని కూడా ఆరోజు ప్రదర్శించనున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: