మళ్లీ ఉగ్రరూపం దాల్చిన దిల్లీ రైతులు ఉద్యమం?

Chakravarthi Kalyan
దిల్లీలో మళ్లీ రైతు ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. దిల్లీ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత చెలరేగుతోంది. నల్ల చట్టాలు తెచ్చి రైతులను మోదీ మోసం చేశారని.. రైతుల ఆందోళనతో వెనక్కి తీసుకుంటున్న అన్నారని.. కానీ ఇప్పటికీ మూడు పార్లమెంట్ సమావేశాలు జరిగినా బిల్లులు వెనక్కి తీసుకోలేదని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి అంటున్నారు. అదానీ, అంబానికి లాభం చేసే పనిలో మోడీ ఉన్నారని.. నిల్వలు రైతులు జవాన్లకు అక్కరకు వస్తాయని కాంగ్రెస్ ఆలోచన చేస్తే కానీ ఇప్పుడు దాన్ని ఆపేశారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి అన్నారు.

బడాబాబులకు లబ్ది చేకూర్చేలా మోడీ వ్యవహారం ఉందన్న కోదండ రెడ్డి.. రైతులు ఏం డిమాండ్ చేస్తున్నారు.. కేసులు ఎత్తేయాలి అని.. మద్దతు ధర ఇవ్వాలని.. బ్యాంకుల ద్వారా అప్పులు రైతులకు ఎక్కువ ఇవ్వాలి అని.. పంటల భీమా పథకం పక్కన పెట్టారని కోదండ రెడ్డి అన్నారు. మద్దతు ధర అడిగే విషయంలో రైతుల సలహాలు కూడా తీసుకోవడం లేదని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: