కేసీఆర్‌ అసెంబ్లీకి ఎందుకు ముఖం చాటేశారు?

Chakravarthi Kalyan
నిన్న తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై వాడి వేడి చర్చ జరిగింది. కానీ ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాలేదు. రాష్ట్ర ప్రజలు నీళ్లు నిధులు నియమాకాల కోసం తెలంగాణ ఉద్యమం చేశారని.. అసెంబ్లీలో నీళ్లపై ఈ రోజు చర్చ పెడితే పదేళ్లుగా సీఎం ఉన్న కేసీఆర్ రాలేదని.. ప్రతిపక్ష నాయకునిగా అయన ఎందుకు రాలేదో చెప్పాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు మల్‌ రెడ్డి రంగారెడ్డి, మదన్ మోహన్ రావు, రామచంద్రనాయక్‌, రామ్మోహన్ రెడ్డి కేసీఆర్‌ తీరుపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ముఖం చాటేసి నల్గొండలో ఏం చేప్తారని మల్‌ రెడ్డి రంగారెడ్డి ప్రశ్నించారు.
హరీష్‌రావు సభలో అబద్దాలు మాట్లాడుతున్నారని మదన్ మోహన్ రావు ఆరోపించారు. ఈఎన్సీని అడ్డం పెట్టుకుని ప్రాజెక్టుల మీద లక్ష కోట్లు దోచుకున్నారని ఆయన మండిపడ్డారు.  కేసీఆర్ నిజమైన తెలంగాణ వాది కాదని...తెలంగాణాను ఎప్పుడో వదిలేసి భారత రాష్ట్ర సమితి పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: