రేవంత్‌ ఎఫెక్ట్‌: వాటినే నమ్ముకున్న టీడీపీ

Chakravarthi Kalyan
తెలంగాణలో కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు తెలుగు దేశం కూడా అలాంటి గ్యారంటీలనే నమ్ముకుంటోంది. శంఖారావం ద్వారా యాత్రలు ప్రారంభించిన నారా లోకేశ్.. టీడీపీ సూపర్-6 ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని క్యాడర్‌కు సూచించారు. హామీలను ప్రతి గడపకు తీసుకెళ్లాలని.. వైసీపీకి వాలంటీర్లు ఉంటే..మనకు 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని అన్నారు.

బాదుడే బాదుడే, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాలు బాగా చేశాం..ఇప్పుడు బాబు సూపర్ – 6ను సమర్థవంతంగా తీసుకెళ్లాలన్న నారా లోకేష్.. సీనియర్లను గౌరవిస్తా...కొత్తవారిని ప్రోత్సహిస్తా. ప్రజల చుట్టూ తిరగండి..మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి నామినేటెడ్ పదవి ఇస్తానన్నారు. ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పసుపు జండా రూపొందించారో కానీ జండా చూస్తే మాత్రం రక్తం ఉడుకుతుందన్న నారా లోకేష్.. కార్యకర్తల పార్టీ అంటే టీడీపీ గురించే దేశంలో మాట్లాడాతారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: