తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ క్లీన్‌బౌల్డ్‌?

Chakravarthi Kalyan
తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందంటున్నారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి.. ప్రధానిగా మళ్లీ మోదీ ఉండాలని రాష్ట్ర యువత కోరుకుంటోందంటున్న కిషన్‌రెడ్డి..జాతీయ స్థాయిలో ఒక్క ఎంపీ సీటు కూడా ప్రకటించలేదని.. టికెట్లపై కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఇవాళ రాష్ట్ర ఎన్నికల కమిటీ, ఎన్నికల నిర్వహణ కమిటీ భేటీ జరుగుతుంది.

గతంలోనే మేము మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శించామన్న కిషన్‌ రెడ్డి.. ఇప్పుడు మళ్లీ మేడిగడ్డకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. కృష్ణా జలాల సమస్యపై ఏపీ, తెలంగాణ మాట్లాడుకుంటే సరిపోతుందని కిషన్‌ రెడ్డి అన్నారు. విజయ సంకల్ప్‌ యాత్రల్లో తాను పాల్గొంటానని..ప్రతి నియోజకవర్గం యాత్రలో 2 రోజుల చొప్పున పాల్గొంటానని కిషన్‌ రెడ్డి తెలిపారు. భాజపాకు దేశంలో సానుకూల వాతావరణం ఉందన్న కిషన్‌రెడ్డి.. శాసనసభ ఎన్నికలకు భిన్నంగా లోక్‌సభ ఫలితాలు ఉంటాయని.. హైదరాబాద్‌లో ఎంఐఎంను ఓడించేలా మా కార్యాచరణ ఉంటుందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs

సంబంధిత వార్తలు: