పులివెందులలోనూ ఇక టీడీపీ జెండా?

Chakravarthi Kalyan
వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయ ఢంకా మోగిస్తుందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఏపీలోని మొత్తం 175 స్థానాల్లోనూ టీడీపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అంటున్నారు. పులివెందుల్లోనూ తెదేపా జెండా ఎగరవేస్తామంటున్న అచ్చెన్నాయుడు.. శ్రీకాకుళం జిల్లాలో కింజరపు కుటుంబాన్ని ప్రజలు కాపాడుకుంటూ వస్తున్నారన్నారు. ప్రజల్లో ఎర్రన్నాయుడు చైతన్యం తీసుకువచ్చారని.. టెక్కలి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని.. కుప్పంతో పోటీపడి మరీ టెక్కలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని అచ్చెన్నాయుడు అంటున్నారు.

సీఎం జగన్‌ మాత్రం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని.. రూ.11 లక్షల కోట్లు అప్పులు తెచ్చారని.. రాష్ట్రంలో వైకాపా నేతలు దోపిడీ చేశారని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రజలు న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉంటారన్న అచ్చెన్నాయుడు.. ఎక్కిడికెళ్లినా ప్రజలు వైసీపీను అసహ్యించుకుంటున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో టెక్కలిలో టీడీపీకి 50వేల మెజార్టీ రావాలన్న  అచ్చెన్నాయుడు.. టెక్కలి నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా మారుస్తానని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: