రేవంత్‌రెడ్డిని చూసి స్ఫూర్తి పొందిన మోడీ సారు?

Chakravarthi Kalyan
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చూసి ప్రధాని మోడీ కూడా ఇన్‌స్పైర్ అయినట్టున్నారు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన పదేళ్ల తర్వాత ఇప్పుడు మోడీ సర్కారు గత యూపీఏ పాలనపై శ్వేత పత్రం నిన్న సభలో పెట్టింది. ఇలా శ్వేతపత్రం పెట్టడాన్ని ఇటీవల రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో స్టార్ట్ చేశారు కదా. దీన్ని చూసి మోడీ సర్కారు కూడా పార్లమెంటులో శ్వేతపత్రం ప్రవేశపెట్టింది. భారత ఆర్థిక వ్యవస్థపై ఆర్థిక మంత్రి శ్వేతపత్రం ప్రవేశపెట్టారు.
రాజకీయంగా, విధానాలపరంగా ఎన్డీఏ స్థిరంగా ఉందని తెలిపిన నిర్మలా సీతారామన్‌.. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కఠిన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలోని సంక్షోభాలను అధిగమించామని.. దేశ ఆర్థిక రంగాన్ని గాడిన పెట్టామని.. దేశ స్థిర వృద్ధికి సంస్కరణలను తీసుకొచ్చామని.. చెప్పుకొచ్చారు. శ్వేతపత్రం పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచుతుందన్న నిర్మల.. యూపీఏ విడిచిపెట్టిన సవాళ్లను విజయవంతంగా అధిగమించామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: