
ప్రేమజంట పార్కులో కనిపిస్తే.. అరాచకమే?
ప్రేమ జంటలను రహస్యంగా వీడియో తీస్తున్నారు. ఆ తర్వాత ఆ వీడియోలు చూపించి బెదిరిస్తున్నారు.
ఈ వీడియోలు లీక్ చేస్తామని ప్రేమజంటలను బెదిరించిన ముఠా.. అనేక జంటలను బెదిరించి డబ్బు, నగలు తీసుకుంది. ఈ ముఠాలో మొత్తం ఆరుగురు యువకులు ఉన్నట్టు తెలుస్తోంది. నల్గొండకు చెందిన కుంచం చందు (21), కుంచం ప్రశాంత్ (19), చింతా నాగరాజు (23), అన్నెపూరి లక్ష్మణ్ (23), శివరాత్రి ముకేష్ (18), కుంచం రాజు(23) అరెస్టును పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా సభ్యుల నుంచి బంగారు ఉంగరాలు, సెల్‌ఫోన్లు, ఖరీదైన వాచీలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి 2 టీవీలు, డ్రిల్లింగ్ మిషన్, ఇన్వర్టర్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.