జగన్‌ గుట్టంతా బయటపెడతా.. ఆ ఎంపీ వార్నింగ్‌?

Chakravarthi Kalyan
ఇటీవల వైసీపీ నుంచి వెళ్లిపోయి జనసేనలో చేరిన ఎంపీ బాలశౌరి ఇప్పుడు జగన్‌కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 2004 నుంచి 2009 వరకు ఏం జరిగిందో తనకు మొత్తం తెలుసంటూ హెచ్చరిస్తున్నారు. తనకు చాలా పెద్దపెద్ద విషయాలు తెలుసంటున్న బాలశౌరి..  2019 నుంచి 2024 వరకు నాకు తెలియని విషయాలేమీ లేవన్నారు.. తాను క్రమశిక్షణ ఉన్న రాజకీయ నాయకుడినంటున్న ఎంపీ బాలశౌరి ఆ విషయాలన్నీ బయటపెడాతనని అంటున్నారు.

జగన్‌ చెప్పే మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుందంటున్న ఎంపీ బాలశౌరి..  ఎన్నికల సభల్లో అసలు అబద్ధాలు చెప్పనంటూ జగన్‌ చెప్పేదే పెద్ద అబద్ధమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు గుంటూరు-విజయవాడ మధ్యలో రాజధాని ఉంటుందని చెప్పారని... రాజధాని పరిసర ప్రాంత ప్రజాప్రతినిధులమైన మాకు ఆనాడు రాజధాని పేరు చెప్పి ఓట్లడగండని చెప్పారని ఎంపీ బాలశౌరి గుర్తు చేసుకున్నారు. జగన్ మాటలు నమ్మినందుకు మమ్మల్ని అభాసుపాలు చేశారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: