
సలహాల కోసం జగన్ ఖర్చు.. రూ. 680 కోట్లు?
సలహాదారులు ఇచ్చే సలహాలను సీఎం నిజంగా తీసుకుని అమలు చేస్తున్నారా అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ నిలదీశారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించకుండా ఐబీ సిలబస్ అమలు అంటున్నారని.. ఏ సలహాదారు చెబితే ఈ విద్యా విధానంలో మార్పు తెచ్చారని.. ఈ సలహాదారుల వల్ల ప్రజలకు, రాష్ట్రానికి జరిగిన మేలు ఏంటో ప్రభుత్వం చెప్పగలదా అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.