నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రేపే నోటిఫికేషన్‌?

Chakravarthi Kalyan
తెలంగాణ గ్రూప్ 1 లో మరిన్ని పోస్టులు వచ్చే అవకాశం ఉంది. దీనిపై రేపే నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. 503 పోస్టులతో 2022 ఏప్రిల్ లో నోటిఫికేషన్‌ వచ్చిన సంగతి తెలిందే. దీనికి 3.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా 2022 అక్టోబర్ లో పరీక్ష నిర్వహించారు. అయితే.. పేపర్ లీకేజీ వల్ల ఈ పరీక్ష రద్దు చేశారు.. తిరిగి 2023 జూన్ లో మళ్ళీ పరీక్ష నిర్వహించినా పరీక్ష నిర్వహణలో లోపాలు ఉన్నాయన్న కారణంగా ఈ పరీక్ష రద్దు చేయాలని హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది.
ఈ లోపు ప్రభుత్వం మారింది. ఈ కేసును ఉపసంహరించుకోవాలని భావిస్తున్న కొత్త ప్రభుత్వంమరి కొన్ని పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకారం ఫిబ్రవరి 1 న గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇప్పటికే పేర్కొన్నారు. అందువల్ల రేపు రీ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: