ఆడపిల్లను జుట్టుపట్టుకుని.. అలా చేస్తారా?

Chakravarthi Kalyan
జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏబీవీపీ విద్యార్ధి సంఘం నేత ఝాన్సిని జుట్టు పట్టుకుని ఈడ్చిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఘాటుగా స్పందించింది. దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ వివరణ కోరింది. అసలేమైందంటే.. హైకోర్టు కోసం యూనివర్సిటీ భూమిని కేటాయిస్తూ తెచ్చిన జోవోను రద్దు చేయాలని గత కొంత కాలంగా వర్సిటీ విద్యార్ధులు ఆందోళన చేస్తున్నారు. ఈ నెల 25 వారికి మద్దతు తెలిపేందుకు ఏబీవీపీ నేతలు అక్కడకు వెళ్లారు.
ఆందోళనకారులను నిలువరించే క్రమంలో ఝాన్సీ అనే ఏబీవీపీ నాయకురాలిని పోలీసులు బైక్‌ పై వెంబడించారు. వెనకు కూర్చుని ఉన్న మహిళా కానిస్టేబుల్.. ఝాన్సీ జుట్టు పట్టుకోగా ఆమె కింద పడిపోయింది. ఈ వీడియో మీడియాతో పాటు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. మీడియా కథనాలు ఆధారంగా సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ సిఎస్‌, డిజిపి కి నోటీసులు జారీ చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: