కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌ గోడల్లో వజ్ర వైఢూర్యాలు?

Chakravarthi Kalyan
మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫామ్‌హౌస్‌లోని ఏ గోడను తొలిచినా నోట్ల కట్టలు, వజ్ర వైఢూర్యాలు బయటకొస్తాయంటున్నారు కాంగ్రెస్‌ మాజీ ఎంపీ మధు యాష్కీగౌడ్‌. కేసీఆర్‌ ఫాంహౌస్‌పై దాడి చేస్తే వందల కోట్ల రూపాయలు బయటపడతాయంటున్న మధు యాష్కీగౌడ్‌.. అక్కడ ఆయన నోట్ల కట్టలపైనే పడుకుంటారని, అక్కడి ఏ గోడను తొలిచినా నోట్ల కట్టలు, వజ్ర వైఢూర్యాలు బయటకొస్తాయని అంటున్నారు. అందుకే దానిపై ఏ విధంగా దాడి చేయాలనే విషయమై తమ ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని మధు యాష్కీగౌడ్‌ అన్నారు.

లోక్‌సభ ఎన్నికలకు ముందే కేసీఆర్‌ అవినీతి బయటకు వస్తుందన్న మధు యాష్కీగౌడ్‌..  రాష్ట్రంలో ఏ ఒక్క అవినీతి అధికారినీ, కల్వకుంట్ల కుటుంబ సభ్యులను కాంగ్రెస్‌ ప్రభుత్వం వదిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య తెరవెనుక ఉన్న వ్యాపారం, అవినీతి బంధాన్ని బయటకు తీయాల్సిన అవసరముందని మధు యాష్కీగౌడ్‌ అన్నారు. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ, హైదరాబాద్‌ చుట్టూవున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల్లో మాజీమంత్రి కేటీఆర్‌ కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకుని అమెరికా, దుబాయ్‌లో పెట్టారని మధు యాష్కీగౌడ్‌ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: