బ్లాక్‌ లిస్టులోకి కాళేశ్వరం కాంట్రాక్టర్లు?

Chakravarthi Kalyan
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అతి పెద్ద దగా అని కాంగ్రెస్‌ గతంలోనే విమర్శలు గుప్పించింది. అలాంటి కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. అందుకే కాళేశ్వరం మోసానికి ఒక నిదర్శనమంటున్న కాంగ్రెస్ నేతలు విచారణ జరిపి తీరతామంటున్నారు. కేసీఆర్ పర్యవేక్షణలోనే దగా మోసం జరిగిందని ఆరోపించిన పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్.. ఇంజనీరింగ్ అధికారులు ప్రజల ప్రయోజనాలను, రాష్ట్ర ప్రయోజనాలను పక్కకు పెట్టి, కాంట్రాక్టర్ల అడుగులకు మడుగు లొత్తుతూ వారి ప్రయోజనాలను కాపాడుతూ యావత్ ప్రపంచంలోనే తెలంగాణను అభాసుపాలు చేశారని విమర్శించారు.

అందుకే కాంట్రాక్టర్లు తమ భాద్యతలకు తిలోదకాలిచ్చి ప్రజా ధనాన్ని దోచుకున్నారని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్  తెలిపారు. ఈ కాంట్రాక్టర్ల అందరినీ  బ్లాక్ లిస్టులో పెట్టాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ డిమాండ్ చేశారు. ఇంకా రాష్ట్రంలో వేరే పనులను వారికి అప్పగించి ఉంటే వారిని తప్పించాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ అన్నారు. విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా వెంటనే చర్యలు చేపట్టాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: