సజ్జనార్‌ గుడ్‌న్యూస్‌.. వారికి ఆర్టీసీలో ఉద్యోగాలు?

Chakravarthi Kalyan
ఆర్టీసీలో అనౌన్స్ మెంట్, ఎంక్వయిరీ రూమ్ జాబ్స్ లలో అంధులకు అవకాశం కల్పిస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హామీ ఇచ్చారు. దివ్యాగుల ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను సంఘం నాయకులు సజ్జనార్‌ తీసుకెళ్లారు. డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 215 వ జయంతి వేడుకల్లో సజ్జనర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఆర్టీసీ బస్సులలో వికలాంగులు ఎదుర్కుంటున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయన్న సజ్జనార్‌.. త్వరలో 2375 కొత్త బస్సులను తీసుకుంటున్నామని... అప్పుడు కొంత వెసులుబాటు కలుగుతుందని అన్నారు.

అవసరమైన వికలాంగుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసే విధంగా... ఆర్టీసీ యాజమాన్యం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. రాష్ట్ర రవాణా వ్యవస్థలో మహిళలకు ఉచిత బస్సు పధకం అనేది చరిత్రాత్మక నిర్ణయమని...ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. గత 45 రోజులుగా 12 కోట్లకు పైగా మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేశారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: