టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇన్ ఛార్జి, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్
కాంగ్రెస్ పార్టీకి
రాజీనామా చేయబోతున్నారా.. అంటే అవుననే అనిపిస్తోంది. అతడు తన
పార్టీ పదవికి
రాజీనామా చేయనున్నట్లు తెలిసింది. కొన్నేళ్లుగా పార్టీలోనే ఉన్న అజహర్... తెలంగాణాలో పుట్టిపెరిగినా..
పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ కాదనకుండా పోటీ చేశారు. 2009లో ఉత్తరప్రదేశ్ లో మొరదాబాద్
ఎంపీ స్థానం నుంచి అజహరుద్దీన్
కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2014లో
రాజస్థాన్ లోని టోంక్
ఎంపీ స్థానంలో కూడా అజహర్ పోటీ చేశారు. కానీ అక్కడ పరాజయం చెందారు. ఆ తరువాత హెచ్ సీఎ అధ్యక్షునిగా అజహర్ గెలుపొందారు. ఇటీవల జరిగిన
అసెంబ్లీ ఎన్నికల్లో ఆఖరు నిమిషంలో జూబ్లీహిల్స్ టికెట్ కేటాయించినా అజహర్ పోటీ చేశారు. కానీ స్వల్ప తేడాతో ఓడిపోయారు.
ఇటీవల ఏదో ఒక కోటాలో ఎమ్మెల్సీ పదవి వస్తుందని అజహర్ ఆశించారు. అయితే
ఎమ్మెల్యే కోటాలోనూ,
గవర్నర్ కోటాలోనూ... రెండింటిలోనూ అజహర్ పేరు కనిపించలేదు. ఆయన ఇక
కాంగ్రెస్ కొనసాగడం ఇష్టం లేక.. ఆ
పార్టీ సభ్యత్వానికి.. టీపీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి
రాజీనామా చేయాలనే తలంపుతో ఉన్నట్టు తెలుస్తోంది.