అయోధ్య: తప్పక తెలుసుకోవాల్సిన విశేషాలు?

Chakravarthi Kalyan
అయోధ్యలో మెుత్తం 70 ఎకరాల విస్తీర్ణంలో రామ మందిరం ఏర్పాటవుతోంది. ప్రస్తుతం 2.07 ఎకరాల్లో రామమందిర ప్రధాన ఆలయ నిర్మాణం జరిగింది. అయోధ్యలో జీ+2 పద్ధతిలో భవ్య, దివ్య రామమందిరం నిర్మాణం జరిగింది. సంప్రదాయ నాగర శైలిలో అయోధ్య రామమందిరం నిర్మాణం జరిగింది. 380అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పులో ఆలయం నిర్మించారు.
161 అడుగుల ఎత్తుతో అయోధ్య రామమందిరం నిర్మించారు. మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలతో రామమందిరం నిర్మాణం జరిగింది. 2500 ఏళ్లు పటిష్ఠంగా ఉండేలా ఆలయ నిర్మాణం ఏర్పాటు చేశారు. తెల్లని పాలరాతితో రామ మందిరంలోని గర్భగుడి నిర్మించారు. రాముడి దివ్య రూపం  భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. రాముడి చేతిలో బంగారు విల్లు, బాణం ఉంటాయి.  51 అంగుళాల ఎత్తుతో ఐదేళ్ల బాలరాముడి విగ్రహం.. ఆకర్షణీయమైన నల్లని రాతితో కనుల విందు చేయనుంది. కమలంలో నిల్చున్నట్లు కర్ణాటక శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ బాలరాముడి విగ్రహం రూపొందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: