బావిలో దూకుతానంటున్న మల్లారెడ్డి?

Chakravarthi Kalyan
అధిష్టానం మాటకు కట్టుబడి ఉంటానని మాజీ మంత్రి మల్లారెడ్డి అంటున్నారు. మల్లారెడ్డి.. పోయి బాయిలో దూకమని అధిష్టానం చెబితే దూకుతానని మాజీ మంత్రి మల్లారెడ్డి శపథం చేస్తున్నారు. ఐటీ మంత్రిగా కేటీఆర్ లేకుంటే ప్రజలు భరించలేకపోతున్నారని.. ఎక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చూసినా అందులో కేసీఆర్ కనిపిస్తున్నారని.. అటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేరని ప్రజలు బాధ పడుతున్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి అంటున్నారు.

కాంగ్రెస్ కు కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు వచ్చాడని.. ప్రభుత్వంలో రోజూ చర్చలే కానీ, ప్రజలకు చేసిందేమీ లేదని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మీరు అధికారంలోకి వస్తారని మేము కలలు కని అప్పుల పాలు చేశామా అని ప్రశ్నించిన మాజీ మంత్రి మల్లారెడ్డి.. అభివృద్ధి చేశాం... అందుకే అప్పులు అయ్యాయన్నారు. కేసీఆర్ కు హైదరాబాద్ లో కనీసం ఇళ్లు లేదు, కేసీఆర్ మహాత్ముడని.. పరిపాలన రావాలి, డబ్బులు కాదు కావాల్సింది
ప్రజలకు అన్నీ అర్థం అయ్యాయని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: