ఇవాళే సింగరేణి ఎన్నికలు.. కేసీఆర్కు మరో ఓటమి?
ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలో సింగరేణి ఎన్నికలు జరుగుతున్నాయి. మెుత్తం నాలుగు జిల్లాల్లోని 11 డివిజన్లలో ఉన్న సింగరేణి సంస్థకు ఈ ఎన్నికల్లో 39,775 మంది కార్మికులు ఓటేస్తారు. సింగరేణి ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు తలపడుతున్నాయి. కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ, బీఆర్ఎస్ సంస్థ టీబీజీకేఎస్, సీపీఐ సంస్థ ఏఐటీయూసీ మధ్య ప్రధాన పోటీ ఉంది.