రామోజీ వద్ద ఆ టీడీపీ నేత బ్రోకర్‌ పని చేశారా?

Chakravarthi Kalyan
టీడీపీ నేత కాల్వ శ్రీనివాస్‌ పై ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి మండిపడ్డారు. టీడీపీ హ‌యాంలో రాయదుర్గంను అభివృద్ధి చేయలేకపోయిన ఓ దద్దమ్మ  కాల్వ శ్రీనివాస్‌ అని కాపు రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయ‌దుర్గంలో నాలుగున్నరేళ్ల వైయ‌స్‌ఆర్ సీపీ పాల‌న‌లో తాను చేసిన అభివృద్ధి చూపిస్తూ రోజూ ఫొటోలు పెడతాన‌ని ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి  అన్నారు. సాగు, తాగునీటిపై టీడీపీ నేత కాల్వ శ్రీనివాస్‌ అబద్ధాలు చెబుతున్నాడ‌ని ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి మండిప‌డ్డారు.

టీడీపీ పాలనలో కాల్వ శ్రీ‌నివాస్‌ వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడ‌న్న ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి .. రామోజీరావు వద్ద కాల్వ శ్రీనివాస్‌ బ్రోకర్‌ పని చేశాడంటూ దుయ్యబట్టారు. సీఎం వైయ‌స్ జగన్‌ సహకారంతో రాయదుర్గం నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి కృషి చేశాన‌ని ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. 45 గ్రామాలకు తారు రోడ్లు వేయించానని, 58 చెరువులకు నీటి సరఫరాకు చర్యలు చేపట్టామని ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: