ఇవాళ మోడీని కలవనున్న రేవంత్‌, భట్టి?

Chakravarthi Kalyan
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధానమంత్రి మోదీని కలువడంతోపాటు, కాంగ్రెస్‌ పెద్దలను కూడా వారు కలువనున్నారు. అధికారం చేపట్టిన తరువాత మొట్టమొదటిసారి రేపు సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అవుతున్న సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు విభజన హామీలు, రాష్ట్రానికి రావల్సిన బకాయిలు, రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చించవచ్చు.
రేవంత్ రెడ్డి సర్కారు ముందు ఆర్థికంగా చాలా సవాళ్లున్నాయి. ఆరు గ్యారంటీల భారమో మోయలేనంతగా ఉంది. ఇలాంటి సమయంలో కేంద్రం సహకారం లేకుండా నెగ్గుకురావడం కష్టం. గత కేసీఆర్ సర్కారు కూడా చివరి ఐదేళ్లు కేంద్రంతో సఖ్యతగా లేదు. అందువల్ల తగిన నిధులు సాధించుకోలేకపోయంది. అందుకే రేవంత్ రెడ్డి ముందు జాగ్రత్త పడుతున్నారు. మరి ఇది వర్కవుట్ అవుతుందా?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: