
సీఎం రేవంత్ మరో సంచలన కార్యక్రమం?
ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. వీటిలో చాలా దరఖాస్తులు గ్రామస్థాయి సమస్యలకు సంబంధించినవే. అందుకే ఈ కొత్త కార్యక్రమం రూపొందించారు. అయితే ఈ కార్యక్రమం ఎలా అమలు చేయాలనే అంశంపై రేపు కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్నారు. గ్రామ, మండల స్థాయుల్లో సమస్యలకు నేరుగా పరిష్కారం చూపించే ఈ కార్యక్రమం సరిగ్గా నిర్వహిస్తే ప్రజల సమస్యలు చాలా వరకూ పరిష్కారం అవుతాయి.