శ్వేతపత్రాల పేరుతో కాంగ్రెస్ బోల్తా కొట్టిందా?
కాంగ్రెస్ సభ్యులతో దాడులు చేయించే ప్రయత్నం చేశారన్న జగదీశ్వర్ రెడ్డి.. శాసన సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడారని.. ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేందుకు శ్వేత పత్రం పేరుతో ప్రభుత్వం డ్రామాలు ఆడిందని విమర్శించారు. కార్పొరేషన్ల అప్పులు కార్పొరేషన్లు తీర్చుకుంటాయన్న జగదీశ్వర్ రెడ్డి.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మూడు గంటల కంటే ఎక్కువ ఇవ్వడం లేదని.. బీఆర్ఎస్ 24గంటల కరెంట్ ఇచ్చిందని కడుపు మంటగా ఉందని మండిపడ్డారు.