మా కులానికి ఇవి ఇవ్వాల్సిందే.. యాదవుల డిమాండ్లు?

frame మా కులానికి ఇవి ఇవ్వాల్సిందే.. యాదవుల డిమాండ్లు?

Chakravarthi Kalyan
తెలంగాణలో యాదవ కులానికి ఒక మంత్రి పదవి, రెండు ఎంపీ సహా అనేక పదవులు ఇవ్వాలని ఆ సామాజిక వర్గం వారు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 16శాతం జనాభా కలిగి ఉన్నయాదవులకు కాంగ్రెస్‌ పార్టీ తగిన ప్రాధాన్యత ఇవ్వాలంటున్నారు. పీసీసీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ అంజన్‌కుమార్‌ యాదవ్‌ నేతృత్వంలో ఆదర్శనగర్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో యాదవ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో యాదవలు హాజరయ్యారు.


యాదవ సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి, ఒక రాజ్యసభ సభ్యుడు, ఒక లోకసభ స్థానం, రెండు ఎమ్మెల్సీలు, అయిదు కార్పోరేషన్‌ పదవులు, అయిదు జిల్లా పరిషత్తు ఛైర్మన్‌ పదవులు, అయిదు డీసీసీబీ ఛైర్మన్లు, అయిదు డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ పదవులు ఇవ్వాలని వారు కాంగ్రెస్‌ పార్టీని కోరారు. మరి వారు కోరినన్ని పదవులు కాంగ్రెస్ ఇస్తుందా..లేదా అన్నది త్వరలోనే తేలుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు:

Unable to Load More