హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు సంబంధించి కొత్త సీఎం రేవంత్ రెడ్డి బిగ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నూతన పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసేందుకు భూములు సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అధికారులకు ఆదేశించారు. ఓఆర్‌ఆర్‌కు బయట, రీజినల్ రింగ్ రోడ్‌కు లోపల 500 నుంచి 1000 ఎకరాల మేర భూములను గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంతే కాదు.. అవి కూడా విమానాశ్రయాలకు, జాతీయ రహదారులు, స్టేట్ రహదారులకు 50 నుంచి 100 కిలోమీటర్ల దూరంలోపే ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
పరిశ్రమల కోసం సేకరించే భూములు, బంజరు భూములై ఉండడంతోపాటు సాగుకు యోగ్యంకాని కానివిగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ఇలా చేయడం వల్ల రైతులకు నష్టం లేకుండా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాలుష్యం తక్కువగా ఉండేట్లు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.