పాదయాత్రలో భాగంగా యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం జివిఎంసి 82వ వార్డులో యాదవులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్న నారా లోకేష్.. ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు ఉంచారు. టిడిపి హయాంలో గొర్రెల కొనుగోలు కోసం సబ్సిడీ రుణాలు ఇచ్చేవారని.. జగన్ పాలనలో గొర్రెల కొనుగోలు కోసం రుణాలు ఇవ్వడం లేదన్న నారా లోకేష్.. యాదవులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కృష్ణుడు గుడి కట్టుకోవడానికి సాయం అందించాలన్నారు. 50 ఏళ్లు దాటిన గొర్రెల పెంపకం దారులకు పెన్షన్ ఇవ్వాలని.. బిసి సంక్షేమ హాస్టళ్లు చాలా దారుణంగా ఉన్నాయని... వాటిని ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా అభివృద్ధి చెయ్యాలని నారా లోకేష్ అన్నారు.
టిటిడి బోర్డులో యాదవులకి ప్రత్యేక స్థానం కల్పించాలని.. యాదవులకు మరిన్ని రాజకీయ అవకాశాలు కల్పించాలని.. జగన్ ప్రభుత్వం యాదవ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసాడని.. ఒక్క రుణం ఇవ్వడం లేదని.. జగన్ పాలనలో ఒక్క యాదవ భవనం కట్టలేదని నారా లోకేష్ అన్నారు. పశువులు మేపుకునే భూములు వైసిపి ప్రభుత్వం వెనక్కి లాక్కుందన్న నారా లోకేష్.. గొర్రెలు చనిపోతే టిడిపి హయాంలో ఇన్స్యూరెన్స్ ఇచ్చేవారన్నారు.