సీఎం రేవంత్ కొత్త ఆఫీస్.. అక్కడేనా?
ఎంసీహెచ్ఆర్డీ ఫ్యాకల్టీ సభ్యులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డికి ఆ సంస్థ కార్యకలాపాలను ఆ సంస్థ డీజీ శశాంకగోయల్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఉద్యోగులకు ఇస్తున్న శిక్షణ గురించి సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. సంస్థలోని వివిధ బ్లాకులను సోలార్ పవర్ వాహనంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్దేశించుకున్నలక్ష్యాలను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.