కొత్త మంత్రులకు శాఖలు.. షాక్ ఇచ్చిన రేవంత్ రెడ్డి
పొన్నం ప్రభాకర్‌కు రవాణా, బీసీ సంక్షేమం శాఖలను సీఎం రేవంత్ రెడ్డి కేటాయించారు. కొండా సురేఖకు అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖలను కేటాయించారు. సీతక్కకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా- శిశు సంక్షేమం శాఖలను సీఎం రేవంత్ రెడ్డి కేటాయించారు. తుమ్మల నాగేశ్వరరావుకు వ్యవసాయ, చేనేత, టెక్స్ టైల్స్ శాఖలను కేటాయించారు. శ్రీధర్ బాబు - ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాలు, జూపల్లి ఎక్సైజ్, పర్యాటకశాఖలను సీఎం రేవంత్ రెడ్డి కేటాయించారు.