చంద్రబాబు పాపాలే.. రైతులకు శాపాలా?

Chakravarthi Kalyan
అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు అయినా ఇంకా వైసీపీ సర్కారు చంద్రబాబు సర్కారు చేసిన తప్పులనే ప్రస్తావిస్తోంది. చంద్రబాబు చేసిన అనేక పాపాలు రైతులకు శాపాలుగా మారితే వాటిని సరిదిద్దామని తాజాగా మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డి అంటున్నారు. బాబు హయాంలో రూ.119.44 కోట్లు రైతులకు ఎగ్గొట్టి వెళితే... కేంద్రం, ఇన్సూ్యరెన్స్‌ కంపెనీలతో మాట్లాడి ఆ డబ్బు రైతులకు ఇప్పించామని మంత్రి చెప్పారు. వీటికి తోడు చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.596 కోట్లతో మొత్తం రూ.715.84 కోట్ల బకాయిలను ఈ ప్రభుత్వం చెల్లించిందని మంత్రి వివరించారు.
ఈ క్రాపింగ్‌ చేసి రైతులకు రశీదులు కూడా ఇచ్చామని... దాంట్లో ఏంత విస్తీర్ణంలో సాగు చేశారనే అంశాలను పొందుపరుస్తూ ప్రీమియం ఎంత ఇచ్చామో కూడా పేర్కొన్నామని మంత్రి తెలిపారు. ప్రీమియం కూడా కట్టిన తరవాత కూడా ఎల్లో మీడియాలో తప్పుడు రాతలు రాస్తున్నారని మంత్రి  విమర్శించారు. 2023 ఖరీఫ్‌లో అన్ని రకాల పంటలు కలిపి 93 లక్షల ఎకరాలను ఈ క్రాపింగ్‌ కింద నమోదు చేశామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: